* ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్టేకులపల్లి, జనవరి 26( జనం సాక్షి): భారత స్వాతంత్ర్యం సిద్ధించడానికి ఎందరో దేశ నాయకులు, మహనీయుల చేసిన త్యాగాలను ఎన్నటికీ మరువలేనివని, వారి త్యాగాల ఫలితమే భారతదేశంలో ప్రజలందరము స్వేచ్ఛ జీవితాలను అనుభవిస్తున్నామని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్ అన్నారు. గురువారం టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామంలో యువకులు, గ్రామస్తులు పిలుపుమేరకు గ్రామంలోని బి ఆర్ ఎస్ పార్టీ గద్దెపై 74వ గణతంత్ర దినోత్సవ వేడకలో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యం రావడం కోసం మన దేశ నాయకులు చేసిన త్యాగాలు,వారు పడిన కష్టాలను వివరిస్తూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బిఆర్ఎస్ నాయకులు బానోతు రామా నాయక్, బానోతు కిషన్ నాయక్, సులానగర్ ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య, మాలప్రోలు జయరాజు, రాస మల్ల నరసయ్య, ఉండేటి ఇర్మియ, ఉండేటి దేవరాజు, బల్లెం బిక్షం,కుమ్మరి కిరణ్, కుమ్మరి గురవయ్య, బోడ రమేష్, కొట్టే సురేష్, కొప్పుల సురేష్,బల్లెం సుధాకర్, గ్యార పృద్వి, కాలె వంశీ, కే లోతు రాంకుమార్, సూరేపల్లి జయసారది,సూరేపల్లి గోపయ్య, గుండ రవీందర్ రెడ్డి , సూరేపల్లి ఏడుకొండలు,పాసిని భద్రగిరి,కాలే సుందరయ్య, కందుల రాజకుమార్, ఇల్లంగి రవి తదితరులు పాల్గొన్నారు.




