అలంపూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 30)
పవిత్ర పుణ్యక్షేత్రం ఐదవ శక్తిపీఠం శ్రీజోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు పర్యాటకులకు కనువిందు చేసేలా అలంపూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం అలంపూర్ పట్టణాన్ని సందర్శించి శానిటేషన్, రోడ్లు పరిశీలించారు. పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసి తడి, చెత్త పొడి చెత్త వేరువేరుగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వైకుంఠధామం వచ్చేవారికి మరుగుదొడ్లు, త్రాగునీరు, కాంపౌండ్ వాల్, రోడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం అలంపూర్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణాభివృద్ధిపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. అలంపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు విడుదల చేసిందని అట్టినిధులతో పట్టణంలోని మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. పట్టణంలోని చెత్తను తరలించేందుకు మూడు ఆటోలు కొనుగోలు చేయాలని రోడ్డును శుభ్రం చేసే క్లీనింగ్ మిషన్ తీసుకోవాలన్నారు. దేవాలయానికి వీఐపీలు వస్తుంటారు వారికి ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు చేసి రోడ్డు ప్రక్కన మొక్కలు నాటి ట్రీగార్డులు ఏర్పాటు చేసి ప్రతిరోజు నీరు పోయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పన్నులు 100% వసూలు చేయాలని ఆదేశించారు. పట్టణంలో ప్రతిరోజు ట్రాక్టర్, ఆటోలను ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని అన్నారు. పట్టణంలో రోడ్ల వెంట టీ స్టాల్ తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో పందులు సంచరించకుండా పందుల యజమానులకు పిలిపించి పందులను గ్రామానికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదం కలిగించే విధంగా పార్కులు, జిమ్ములు ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రూ.36 కోట్ల నిధులతో ప్రసాద్ స్కీం ద్వారా నిర్మిస్తున్న పనులను పరిశీలించారు మే చివరి నాటికల్లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, మున్సిపల్ చైర్మన్ మనోరమ, కమిషనర్ నిత్యానంద్, ప్రసాద్ స్కీం ప్రాజెక్టు మేనేజర్ జయవర్ధన్, ఆరవ వార్డు కౌన్సిలర్ సుష్మా ఇతర అధికారులు పాల్గొన్నారు.
అలంపూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి




