Monday, 2 November 2026

పోస్టర్ ఆవిష్కరణ..

పోస్టర్ ఆవిష్కరణ..
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 30
తెలంగాణ మలిదశ ,ఉద్యమ తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మరణం తెలంగాణకే తీరని లోటు, ఆయన త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కీసర సంపత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు బజార్ లో కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి గోడ పత్రికలను ఆవిష్కరించారు. సంపత్ మాట్లాడారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి డిసెంబర్ 1న నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి తెలంగాణ ముదిరాజ్ లు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యూత్ అధ్యక్షులు పండుగ బాలు, మండల యూత్ అధ్యక్షులు గుల్ల రాజు. జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పల్లె స్వరూప. ముదిరాజ్ మహాసభ నాయకులు నూనె రవి, సతీష్ ,సురేష్ ,బిక్షపతి, కిరణ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.