Tuesday, 3 November 2026

అలంపూర్ పట్టణ అభివృద్ధి ఐక్యత తోనే సాధ్యం అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్.

 అలంపూర్ మే 30 జనంసాక్షి అలంపూర్ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి అని మున్సిపాల్ చైర్మన్ మనోరమ అన్నారు.అలంపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ అధ్యక్షతన మున్సిపాల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేశారు.ఈసందర్బంగా పట్టణంలోని పలు వార్డులలో ఇంక నిర్మాణం కాక మిగిలిన సీసీ రోడ్లు,డ్రయిన్ ల కొరకు నిధుల మంజూరుకు,హరితాహారంలో ప్రతి ఇంటికి పంపిణీ చేయుటకు పండ్ల,పూల మొక్కలు తెప్పించాలని,2009 వరద బాధితులకు ఇళ్ళ పట్టాల పంపిణీ కొరకు 43 ఎకరాలలో ఉన్న స్థలంలో ముళ్ళ కంప లను తొలగించి పట్టాల పంపిణీకీ సిద్ధం చేయాలని,గత నెలలొ మున్సిపాల్ కార్యాలయము పనుల ఖర్చుల కు బిల్లులు చెల్లించాలని తీర్మానం చేశారు.అనంతరం మున్సిపాల్ చైర్మన్ మనోరమ మాట్లాడుతూ,పట్టణంలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లు,డ్రయిన్లు,వీది దీపాలు , మొదలగు వాటిని ప్రధాన్యత క్రమంలొ మన దగ్గర ఉన్న బడ్జట్ మేరకు చేసుకుందామని తెలిపారు. మరిన్నీ నిధుల కొరకు ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ మరియు మంత్రుల సహకారము తీసుకుందామని అన్నారు.అదేవిధంగా పట్టణంలో 2 వ తెది నుండి జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేద్దామని తెలిపారు.
కార్యక్రమంలో చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ ,కమీషనర్ నిత్యానంద్ ,వైర్ చైర్మన్ శేఖర్ రెడ్డి , మున్సిపాల్ ఇంజనీర్ మేఘనాథ్ , కౌన్సిలర్లు సుదర్శన్ గౌడ్ ,పుష్పలత ,జయలక్ష్మీ ,ఇంతియాజ్ ,లక్ష్మీదేవమ్మ ,సుస్మా ,సఖినాబీ ,సరోజమ్మ ,కోఅప్సన్ సభ్యులు అల్లబకస్ ,బతుకయ్యగారు,ఖలీదాబేగమ్ ,నాగలచ్చమ్మ , మున్సిపల్ సిబ్బంది రామాంజనేయులు తదితరులు పాల్గోన్నారు.