టేకులపల్లి, మే 30( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లక్ష మందితో జూన్ 4న సిపిఐ ఆధ్వర్యంలో జరుపు తలపెట్టిన ప్రజా గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు రామ్ చందర్ పిలుపునిచ్చారు. టేకులపల్లి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం మండల కార్యవర్గ సమావేశం బానోతు వీరన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 4న వేలాదిగా కదలి రావాలని కోరారు. ఉద్యమాల గడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జూన్ 4న సిపిఐ తలపెట్టిన ప్రజా గర్జన బహిరంగ సభకు వేలాదిగా కదిలి రావాలని కోరుతూ పోడు సమస్య, ఇండ్ల కాలనీ సమస్య,నిరుద్యోగ సమస్య, కార్మిక కర్షక హక్కుల పరిరక్షణ కోసం లక్ష గొంతులు ప్రజాగర్జన బహిరంగ సభతో పాలక పక్షాలు పై పోరుకు సిద్ధం చేయుటకు జరుగుతున్న బహిరంగ సభకు అందరూ కదలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి గుగులోతు శ్రీను, అయిత శ్రీరాములు, బానోత్ వీరన్న, తేజావత్ లక్ష్మణ్,ఇస్లావత్ రవీందర్, తేజావత్ మధు, చింత కన్నయ్య, కే సతీష్,సోనీ తదితరులు పాల్గొన్నారు.
లక్ష గొంతుల ప్రజా గర్జనను విజయవంతం చేయండి సిపిఐ జిల్లా సభ్యులు గుగులోతు రామ్ చందర్




