అలమట్టిలో భారీగా వరదనీరు 5 గేట్ల ఎత్తివేత

హైదరాబాద్‌: కర్ణాటకలో అలమట్టి జలాఖయానికి భారీగా వరదనీరు చేరింది. దీంతో అధికారులు ఐదుగేట్లను ఎత్తి 55 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నారాయణపూర్‌ జలాశయం నుంచి కూడా 8 గేట్ల ద్వారా 56 వేల క్యూసెక్కులు నీటిని కిందకు వదిలారు. దీంతో కృష్ణానదిలో ప్రవాహం పెరిగింది. శుక్రవారం రాత్రికి జూరాలకు వరదనీరు చేరనుంది.