Wednesday, 4 November 2026

అలెగ్జాండ్రియాలో ఆత్మాహుతి దాడి

అలెగ్జాండ్రియా: ఇస్లామిక్ మిలిటెంట్లు తాజాగా ఈజిప్టులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆ దేశపు రెండో అతి పెద్ద నగరమైన అలెగ్జాండ్రియాలో మూడు పోలీసు స్టేషన్లలో ఆత్మాహుతి దాడికి పాల్పడగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆ నగర అంతర్గత వ్యవహారాల మంత్రి మేజర్ జనరల్ అమిన్ ఇజ్ అల్ దిన్ మీడియాకు చెప్పారు. 2013 లో ముస్లిమ్ బ్రదర్‌హుడ్ పార్టీకి చెందిన దేశాధ్యక్షుడు మహ్మద్ ముర్సిని సైన్యం పదవీచ్యుతుని చేసిన తర్వాత సినాయ్ ద్వీపకల్పంలో ఇస్లామిక్ మిలిటెంట్లు సాగిస్తున్న మారణహోమంలో వందల మంది పోలీసులు, జనాలు చనిపోయారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *