అల్లూరు సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూటీ ఇసుకపల్లి క్రాస్‌రోడ్డు వద్ద
ఐదేళ్ల చిన్నారితో సహా ముగ్గురి మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అల్లూరు సమీపంలోని ఇసుకపల్లి క్రాస్‌రోడ్డు వద్ద నలుగురు ప్రయాణిస్తున్న స్కూటీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఐదేళ్ళ చిన్నారి నందు ప్రమాదస్థలం వద్దే మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన నందిని తల్లి సంతోషలక్ష్మి (27), అమ్మమ్మ విజయమ్మ (74) నెల్లూరులోని ప్రవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. నందు సోదరుడు ఏడేళ్ల భాను పరిస్థితి విషమంగా ఉంది. తల్లిని, ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్తున్న సంతోషలక్ష్మి బీఎస్సీ, బీఈడీ చదివారు. డీఎస్సీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. మృతురాలి భర్త పేరు శ్రీనివాసులు. ఒక ప్రవేట్ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. వీరి స్వస్థలం చెన్నారాయునిపాలెం.




