జర్నలిస్టుల అక్రిడేషన్లపై కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, జర్నలిస్టు సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలు, అక్రిడేషన్, హెల్త్‌కార్డు, ఇళ్ల స్థలాలపై చర్చించారు. భేటీ అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై చర్చించామన్నారు. త్వరలో తెలంగాణ జర్నలిస్టులకు అక్రిడేషన్, హెల్త్‌కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. అక్రిడేషన్, హెల్త్‌కార్డులపై 9 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కమిటీ వారం రోజుల్లోగా హెల్త్‌కార్డులపై మార్గదర్శకాలు విడుదల చేస్తుందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై త్వరలో మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమవుతామని నారాయణ తెలిపారు.




