Wednesday, 4 November 2026

అవకాశవాద రాజకీయాలు నాకు నచ్చవు

– ముస్లిం కమ్యూనిటీకి జనసేన అండగా నిలుస్తుంది

– ఇప్పుడు బీజేపీని విమర్శిస్తున్న టీడీపీకి 2014లో బుద్ది ఏమైంది

– టీడీపీ నేతలకు నోటి దురద ఎక్కువైంది

– నాకు సీఎం కావాలనే కోరిక లేదు

– మార్పు కావాలన్నదే తన ఆకాంక్ష

– జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

కాకినాడ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : అనేక కులాల సమ్మేళనం భారతదేశం అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా కాకినాడ జి.కన్వెన్షన్‌ హాలులో పవన్‌ కల్యాణ్‌ ముస్లింలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నామన్నారు. ఏ పార్టీ నాయకులనైనా వేరు చేయండి.. కాని దేశ ప్రజలను వేరు చేయొద్దన్నారు. మైనారిటీ అనే పదమే తనకు నచ్చదన్నారు. దేశంలో బతికేందుకు మనకు సంపూర్ణమైన హక్కు ఉందన్నారు. అవకాశవాద రాజకీయాలు తనకు నచ్చవని అన్నారు. ఇప్పుడు బీజేపీని విమర్శిస్తున్న టీడీపీకి 2014లో బుద్ధి ఏమైందని ప్రశ్నించారు. తప్పులు చేస్తుంటే తాను ఊరుకోనన్నారు. దేశభక్తి గుండెల్లో ఉంటుందని, అవసరమైనప్పుడు బయటకు వస్తుందన్నారు. తానెప్పుడూ ఎవరికీ భయపడలేదన్నారు.

ముస్లిం కమ్యూనిటీకి జనసేన నిలబడుతుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ముస్లింలను మైనారిటీలంటే దేశంలోని ప్రతి ఒక్కరూ మైనారిటీలే అవుతారన్నారు. భాషా, సంస్కృతిని గౌరవిస్తానని చెప్పడానికే ఉర్దూ నేర్చుకుంటున్నానన్నారు. బీజేపీ అనేది పొలిటికల్‌ పార్టీ అని పేర్కొన్నారు. భారత దేశపు సమాజం వేరు? భారత దేశపు నాయకులు వేరన్నారు. నాయకుల లబ్ది కోసం చేసినవే తప్ప.. భారతదేశ సమాజంలో మత వివక్ష లేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాను మనుషుల్ని మతం, కులంతో వేరు చేయనన్నారు. దేశంలో అనేక భిన్న సంస్కృతులు ఉన్నాయన్నారు. నాయకులు మోసం చేసినా? ప్రజలు ఏకపక్షంగా ఉండాలని పేర్కొన్నారు. తనకు సీఎం కావాలన్న ఆశ లేదని? మార్పు కావాలనేదే తన ఆకాంక్ష అన్నారు. ఇప్పటి వరకు మభ్య పెట్టే నాయకులు మాత్రమే వచ్చారన్నారు. తాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతానన్నారు. రాజకీయ శక్తులు చేసే వలలో మనం పడొద్దన్నారు. నాకు ఓట్ల కోసం భయం లేదన్నారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తులు దేశానికి చాలా అవసరమన్నారు. ముస్లింలను మేము అక్కున చేర్చుకుంటామన్నారు. ఒక్కొక్క మనిషిలో సత్యం ఎండుకుపోయిందన్నారు. చంద్రబాబు చెప్పిన షాదీ నజరానా పోస్టర్లకే పరిమితమైందన్నారు. మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌తో పోరాటం చేసిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకున్నారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రేపు చంద్రబాబు బీజేపీతో కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ప్రజల కోసమే జనసేన పార్టీ పెట్టానని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మనదంతా ఒకటే కులమన్నారు. జనసేన పార్టీకి యువతే బలమైన పునాది అన్నారు. కార్యకర్తల శ్రమను తాను గుర్తిస్తానన్నారు. కులాలు, ప్రాంతాలను సమదృష్టితో చూడగలిగిన వాణ్ని అన్నారు. మార్పును తీసుకురావాలన్న ఆలోచన బలం ఉన్నవాణ్ణినన్నారు. తనకు ఓటమి భయం లేదన్నారు. మనందరిదీ ఒకే కులం? మానవ కులమన్నారు. టీడీపీ నేతలు కులాల పేరుతో దూషిస్తున్నారన్నారు. టీడీపీ నేతలకు నోటి దురద ఎక్కువైందన్నారు. అండగా నిలబడి భుజం కాస్తే? తిడితే ఎలా? అని ప్రశ్నించారు.