
ఆర్ముర్ జులై 06(జనం సాక్షి): జునోటిక్ వ్యాధులు పట్ల ప్రజలలో అవగాహన కొరకు ఉచితంగా టీకాలు ఇవ్వడం జరిగిందని ఆర్మూర్ వెటర్నరీ ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జియావుద్దీన్ అన్నారు. గురువారం ప్రపంచ జూ నోసిస్ డే సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో కుక్కలకు ఉచితంగా టీకాలు వేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జినోటిక్ వ్యాధులు అంటారని, 1885 సంవత్సరంలో జూలై ఆరవ తేదీన లూయిస్ పాశ్చార్ అను శాస్త్రవేత్త మొట్టమొదటి సారిగా యాంటీ టి రేబిస్ టికాల్ని పిచ్చి కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఇచ్చి విజయవంతం చేశారని అన్నారు. అందుకని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై ఆరవ తేదీన జనోసిస్ డే ను నిర్వహిస్తూ, జెనోటిక్ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గురించి ప్రజలుకు తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ వ్యాధులు ఎక్కువగా సులభంగా పశువులు జంతువులతో సన్నిహితంగా ఉండే వారికి , వృత్తిరీత్యా ఆయా వృత్తిలో సంబంధం ఉండే వారికి త్వరగా సంక్రమిస్తాయన్నారు. ఈ వ్యాధులు గాలి, నీరు ,ఆహారం కలుషితమైన పశు ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా మనుషులకు వ్యాధి వ్యాపిస్తుందని ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరు జినాటిక్ వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అవసరం ఎంతైనా ఉందని అన్నారు.ఈ పంపిణీ కార్యక్రమంలో వైద్యులతో పాటు సిబ్బంది రైతులు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.




