
కంటోన్మెంట్ జనం సాక్షి 06 కంటోన్మెంట్ ఆరో వార్డు నందమూరి నగర్ లోని పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది.వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాన్నిప్రతిష్టించారు. ఈ సందర్భంగా పాండు యాదవ్ మాట్లాడుతూ గతంలో బస్తీలో ఆలయం ఇరుకుగా ఉండేదని తాను ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ విస్తీర్ణాన్ని సైతం పెంచడం జరిగిందన్నారు. తాజాగా అమ్మవారి విగ్రహాన్ని సైతం పునప్రతిష్టమించడం జరిగిందని ఇది బస్తీ ప్రజలకు శుభసూచకం అన్నారు తాను బోర్డు సభ్యుడుగా ఉన్న రోజుల్లో బస్తీలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అన్ని ఆయన వివరించారు.




