Wednesday, 4 November 2026

అవని హాస్పిటల్లో అరుదైన చికిత్స.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో గల అవని పిల్లల ఆసుపత్రిలో శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స విజయవంతమైందని ఆసుపత్రి పిల్లల వైద్యుడు రుద్రభట్ల రఘువంశీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన వర్ష దేవేందర్ శిశువు నెలలు పూర్తవ్వకుండా 7వ నెలలోనే ప్రసవించడం జరిగిందన్నారు. దీంతో శిశువు 800 గ్రాముల తక్కువ బరువుతో జన్మించింది, హైరిస్కు ఉండడంతో నెల రోజులనుంచీ ఆసుపత్రి లోచికిత్స అందించామన్నారు. సోమవారం శిశువును పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో చేర్పించే సమయంలో శిశువుకు ఊపిరితిత్తులు, అవయవాల ఎదుగుదల లేని పీఏహెచ్ సమస్యలు ఉత్పన్నమవడం తో సర్పాల్టెంట్ అను అధునాతన పద్ధతి ద్వారా చికిత్స అందించి విజయవంతంగా ప్రాణహానీ నుంచి శిశువును కాపాడామన్నారు. శిశువు ప్రసు తం 2.4 కిలోల బరువుతో శిశువు ఆరోగ్యంగా ఉందని, ఆర్ఓపీ పరీక్షల్లో కూడా పూర్తి ఆరోగ్యం గా ఉన్నట్లు తేలిందన్నారు. తమపై విశ్వాసం ఉంచి వచ్చిన వారికి హైదరాబాద్ లో కార్పోరేట్ స్థాయిలో ఉన్న సౌకర్యాలు మంచిర్యాల జిల్లా ప్రజలకు అందిచడడం కోసం కృషి చేయడం జరుతుందన్నారు .. రానున్న రోజుల్లో ఈ ప్రాంత మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు. ఉత్తర తెలంగాణలోనే అత్యంత మెరుగైన చికిత్సలు అందిస్తూ అవని ఆసుపత్రి గుర్తింపు సాధించడం గర్వంగా ఉందన్నారు. అనంతరం శిశు తల్లిదండ్రులు వైద్యునికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.