ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద వహించి జాగ్రత్తలు పాటించాలని నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రోజున న పట్టణంలోని న్యూ నాగార్జున కాలనీ లో డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిదిలు నస్పూర్ బీఆరెస్ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న,వంగతిరుపతి లతో కలిసి ప్రారంభించారు. 150 మంది ప్రజలకు బీ.పీ చెకప్ నిర్వహించి ఉచితంగా మందులు పంపణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ వైద్యుడు మల్లేష్, ఆసుపత్రి మేనేజర్ రజిత స్థానిక ప్రజలకు ఆరోగ్య సంరక్షణలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కాలంలో హోమియోపతి మందులు ఉచితంగా పంపిణీ చేశారని ఇది అభినందనీయమన్నారు. కరోనా నాటి నుంచి ఉచితంగా హోమియోపతి మందులు అందజేయడం గొప్ప విషయమన్నారు. అధిక డోసులు వాడితే శరీరంపై దు ష్ప్రభావం జరిగే అవకాశం ఉంటుందన్నారు. హోమియోపతి వంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులను వాడాలని సూచించారు. హోమియోపతి వైద్యంలో సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స ఉంటుందని తెలిపారు. వ్యాధి తీవ్రత ఎలాఉన్నా హోమియోపతి చికిత్సలు తీసుకోవాలన్నారు. కరోనా కాలంలో హోమియోపతి మందులు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ఎదిగే దశ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధచూపి పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామాలు చేయాలన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహించిన వైద్యులను అభినందించారు. అనంతరం నస్పూర్ పట్టణ అధ్యక్షుడు సుబ్బన్న, సీనియర్ నాయకులు 22వ వార్డ్ కౌన్సిలర్ వంగ తిరుపతి , ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్ మాట్లాడుతూ… హోమియో పతి వైద్యంతో మెరుగైన చికిత్స అందుతుందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యముగా భావించాలనీ, వ్యాధి ఎలాంటిదైనా ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవాలన్నారు. పోషకాలతో కూడిన ఆహారం తోపాటు ఆరోగ్యకర చిట్కాలు పాటించాలన్నారు.. ఈ కార్యక్రమంలో 13వ వార్డ్ trs పార్టీ నాయకులు వెంకట్ స్వామీ, బుర్ర రవి, యూత్ అధ్యక్షులు నరేష్, పార్టీ కార్యవర్గ సభ్యులు పులి రాజేందర్, రుకుమ్ ,తిరుమల్, అశోక్, చారి,వంశీ, మొగిలి, దేవన్న, రమేష్, మల్లిఖార్జున్, అశోక్,చారీ, వంశీ, మొగిలి, స్థానిక నాయకులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి… నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్




