Wednesday, 4 November 2026

ప్రజల  నుండి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే  పరిష్కరించాలి.ప్రజల  నుండి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే  పరిష్కరించాలి. – జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, మే 22 (జనం సాక్షి);     ప్రజావాణి  కార్యక్రమానికి ప్రాదాన్యత నిస్తూ ప్రజల  నుండి వచ్చిన పిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని  జిల్లాకలెక్టర్ వల్లూరు క్రాంతి  అధికారులకు, తహశిల్దార్ లకు  ఆదేశించారు.సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  ఏర్పాటు చేసిన  ప్రజా వాణి లో  వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల  ద్వారా 135 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి  వచ్చిన పిర్యదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు వివరించారు. ప్రజల నుండి వచ్చిన పిర్యాదుల లో  ఆసరా పెన్షన్ కు సంబంధించి 12 ధరఖాస్తులు  ,  భూ సమస్యల పై 114 ధరఖాస్తులు  , భూ సర్వే కు సంబంధించి 5 ధరఖాస్తులు , ఇతర సమస్యలపై 4 ధరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని ధరఖాస్తులు పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భూ సమస్యలపై వచ్చిన ధరఖాస్తులను పరిశీలించారు . సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కి వస్తున్న ప్రతిఒక్కరి ధరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   . ఆలంపూర్ , రాజోలి , వడ్డేపల్లి , ధరూర్ మండలాల ప్రజలు ఇచ్చిన  భూ సమస్యలపై పిర్యాదులను పరిశీలించి ఆయా మండలాల తహశిల్దార్ లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో   ఆర్డిఓ రాములు , ఏ ఓ యాదగిరి , సూపరిండెంట్ రాజు ,మదన్ మోహన్ ,జిల్లా అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.