Thursday, 5 November 2026

అవార్డు అందుకున్న ఏఎస్ఐ కిషోర్ కుమార్

 

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): జీసీఎస్ వల్లూరి గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో బంగారు నంది అవార్డుకి ఎంపికైన ఏఎస్ఐ కిషోర్ కుమార్ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా బంగారు నంది అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ 32 ఏళ్లుగా చర్మ వాయిద్యాలపై నైపుణ్యం పెంపొందించుకున్నట్లు తెలిపారు.ఈ నైపుణ్యం ఎంతో శ్రమతో కూడినదన్నారు.తన నైపుణ్యాలను గుర్తించి తెలుసుకొని ఈ అవార్డును అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కృష్ణయ్యతో పాటు మాజీ మంత్రి పుష్పలత, దైవదిన శర్మ, అసెంబ్లీ ఏసిపి రాందాస్, శర్మ, హరిత, నందిని తదితరులు పాల్గొన్నారని తెలిపారు.