Thursday, 5 November 2026

బీసీల అభ్యున్నతికి, బీసీ డిక్లరేషన్ చేసి అమలు చేసే దమ్ము ధైర్యం ప్రభుత్వాలకు,రాజకీయ పార్టీలకు ఉందా? ముకుంద నాగేశ్వర్టీ జేఏసీ చైర్మన్ వికారాబాద్ జిల్లా

 

 

 

 

 

 

 

 

 

దోమ మే13(జనం సాక్షి)ఎటువంటి జనాభా గణన లేకుండా జనాభాలో పది శాతం కూడా లేని వర్గాలకు ఈ, డబ్ల్యూ, ఎస్ పేరుతో విద్యా అవకాశాలలో పది శాతం రిజర్వేషన్ కొరకు చట్టం చేసి అమలు చేస్తున్న ప్రభుత్వాలు యాభై శాతం పైగా జనాభా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కొరకు చట్టం చేసి అమలు చేసే దమ్ము ధైర్యం ఉందా?బీసీలకు చట్టసభలలో (లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి, స్థానిక సంస్థలలో, అన్ని రకాల నామినేటెడ్ పదవులలో) జనాభా ప్రాతిపదికన ప్రాతినిత్యం కల్పించేందుకు పార్లమెంటులో చట్టం చేసి అమలు చేసే దమ్ము ధైర్యం ఉందా?రిజర్వేషన్ల కోసం చట్టాలు ఎన్నికల తరువాత ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత చేస్తాం అనుకుంటే ప్రస్తుతం రాబోవు ఎన్నికలలో కనీసం నలభై శాతం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను బీసీ అభ్యర్థులకు కేటాయించే దమ్ము, ధైర్యం రాజకీయ పార్టీలకు ఉందా?అన్ని రాజకీయ పార్టీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని జనరల్ స్థానాలలో ఇప్పటి వరకు బీసీలకు పార్టీ టికెట్లు ఇవ్వని స్థానాలలో నైనా (ఉదాహరణకు పరిగి ఎమ్మెల్యే స్థానం చేవెళ్ల ఎంపీ స్థానం etc.) బీసీలకు పార్టీ టికెట్లు కేటాయించే దమ్ము ధైర్యం ఉందా?బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలు గానే పరిగణిస్తూ జనాభా ప్రాతిపదికన చట్టసభలలో, విద్య, ఉపాధి, ఉద్యోగ, అవకాశాలలో ప్రాతినిత్యం, భాగస్వామ్యం కల్పించాలని రాజ్యాంగం చెబుతున్నా పట్టించుకోని రాజకీయ పార్టీలు భవిష్యత్తులో మనుగడను కోల్పోవడం ఖాయం బీసీలు పార్టీల జెండాలు మోస్తూనే కాలం వెళ్ళదీయకుండా జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభలలో ప్రాతినిథ్యం కొరకు, ప్రజాస్వామిక హక్కుల సాధన కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.