జనం సాక్షి దుబ్బాక
సిద్దిపేట జిల్లా దుబ్బాక సహాకార సంఘంలో 41 లక్షల అవీనీతీ జరిగిందని సిద్దిపేట డిసిసి కార్యదర్శి ఏలూరి కమలాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు దుబ్బాక ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ
2022 లో సహకార సంఘంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాస రెడ్డి విచారణ జరుపగా 41లక్షల అవీనీతీ జరిగిందని పాలకవర్గం అంగీకరించి తూతు మంత్రంగా చిరు ఉద్యోగి CEO లక్ష్మారెడ్డి ని తొలగించి చెతులు దులుపుకన్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు ఈ అవీనీతిలో బడా నాయకుల భాగస్వామ్యం ఉందని సంచలనం ఆరోపణలు చేసిన కమలాకర్
ఎరువుల బ్లాక్ దందా చేశారని ఎవరి ద్వారా చేశారో త్వరలో బయట పెడతానని హెచ్చరించారు చివరకు రైతులు చెల్లించిన ఋణాలను జమ చేయకుండ కాజేశారని ఆయన ఆరోపించారు. దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంజీవ రెడ్డి బొంగరం బాల్ రెడ్డి. బెల్లి బాల్ నర్సింలు.పార్శారములు సిద్దిరాములు. కిషోర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.




