Thursday, 5 November 2026

అవినీతికి వరదగేట్లు తెరిచిన ప్రభుత్వం: బాబు

తెనాలి: అవినీతికి వరద గేట్లు తెరవడం వల్లే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టు కోలేకపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌పై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెనాలిలోని వీఎస్‌ఆర్‌ కళాశాల విద్యార్థులు చేపట్టిన రాస్తారోకోలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం ఇందిరమ్మబాట నుంచి ఇంటిబాట పట్టడం ఖాయమని ఎద్దేవా చేశారు. వంద శాతం బోధనా రుసుం అన్ని వర్గాలకు అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *