ఢిల్లీ: ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవినీతి నిరోధానికి నడుంబిగిస్తున్నారు. ప్రమాణ స్వీకారం వెంటనే అవినీతి నిరోధక సెల్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ప్రజల చేతికి అధికారం ఇస్తే అవినీతి ఉండదన్న ఎన్నికల హామీ మేరకు అవినీతి నిరోధక సెల్‌కు ఏర్పాట్లు చేయాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించినట్లు సమాచారం. కేజ్రీవాల్ రేపు రాంలీలా మైదాన్‌లో ముఖ్మమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తన మంత్రి వర్గంలోకి ఏడుగురు శాసనసభ్యులను తీసుకోనున్నట్లు సమాచారం.




