Thursday, 5 November 2026

సిద్ధమవుతున్న రామ్ లీలా మైదాన్

అరవింద్ కు భద్రతను సమీక్షిస్తున్న పోలీసులు

శుక్రవారం, 13 ఫిబ్రవరి 2015ఢిల్లీ జ‌నంసాక్షి:

 

 

 

ఢిల్లీలోని రాం లీలా మైదానం మరో ఘట్టానికి నాంది పలకబోతోంది. అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఇక్కడ నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణా స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. కనీసం 50 వేల మంది కూర్చునే అవకాశం ఉన్న ఈ మైదానంలో జరిగే కార్యక్రమానికి విఐపిలు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. సామాన్యులను కూడా కార్యక్రమానికి అరవింద్ పిలుపునివ్వడంతో పోలీసులకు విఐపి భద్రత సవాల్ గా మారనున్నది. 
 అరవింద్ కేజ్రీవాల్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న రామ్‌లీలా మైదాన్‌లో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్ర ప్రజాపనుల శాఖ 75 సీసీటీవీ కెమెరాలను అమరుస్తోంది. వాల్ విడియోలను కూడా అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నారు. రామ్‌లీలా మైదాన్‌కు కేజ్రీవాల్ తన మద్దతుదారులతో కలసి రోడ్‌షోతో రానున్నారు. దీంతో దారిపొడవునా భద్రత విషయమై పోలీసులు ఆప్ నేతలు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. 
పలు కూడళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను అమర్చడం ముఖ్యంగా ఘజియాబాద్ సరిహద్దు వద్ద భద్రత ఏర్పాట్లపై పోలీసులు దృష్టిపెడుతున్నారు, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటికే కౌశాంబీలోని కేజ్రీవాల్ ఉంటున్న భవనం వద్ద క్యాంపును ఏర్పాటుచేశారు. దీంతోపాటు బారికేడ్లను అమర్చారు. అయితే రామ్‌లీలా మైదాన్‌లో 50  వేల మంది కూర్చునేందుకు వీలవుతుంది. అయితే ఈ కార్యక్రమానికి దాదాపు లక్షమంది స్థానికులు హాజరవుతారని పోలీసులు అంచనా వేస్తున్నారు. భద్రత కోసం ఉన్నతాధికారులు 3,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. 
జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను నిరాకరించిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం రోజునకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారింది.  శనివారం ఆప్ మద్దతుదారులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రామ్‌లీలా మైదాన్‌కు తరలి వస్తారని, అందువల్ల తాము  చూస్తూ ఊరుకోలేమని పోలీసులు  కేజ్రీవాల్‌కు తెలియజేశారు. అయితే తమ చర్యలు కార్యకర్తలకు, మద్దతుదారులకు ఇబ్బంది కలిగించేవిగా కాకుండా సమర్థంగా ఉంటాయని పోలీసులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *