Thursday, 5 November 2026

ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంభానికి చెందిన ముగ్గురు మృతి ఛిద్రమైన కుటుంబం

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) మే 20జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది పొట్టకూటి కోసం ఊరూరూ తిరిగి పాతబట్టలు తీసుకుని వంట పాత్రలు అమ్ముకుని వ్యాపారం చేసే ఆ కుటుంబాన్ని అనూహ్యంగా ఈరోజు తెల్లవారు జామున రోడ్డుప్రమాదం రూపంలో బలితీసుకుంది..
గత ఇరవై సంవత్సరాలుగా మృతురాలు జమ్ములమ్మ (50 ) ఆమె భర్త ఒక కొడుకు నలుగురు కుమార్తెలతో గద్వాల మున్సిపాలిటీలోని 7 వ వార్డు దౌదర్ పల్లిలో కిరాయి గుడిసెలో నివాసం ఉంటున్నారు కాగా జమ్ములమ్మ భర్త పది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో పిల్లల భారం తనమీద పడటంతో అంత తానై తన ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి కొద్దిగా భారం తగ్గించుకొని కొడుకు కూతురుతో జీవనం చేస్తూ కొడుకుకి మృతుడు అర్జున్ (24) గత 4 నెలల క్రితం హైదరాబాద్ లో ఉండే బంధువుల అమ్మాయి మృతురాలు కోడలు వైశాలి (22 ) తో పెళ్లి చేసింది కాగా 2 నెలల క్రితం కూతురు కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది…
ఇదే క్రమంలో శనివారం వీళ్లు ముగ్గురు కలిసి గద్వాల నుంచి ధరూర్ వెళ్లుతుండగా పారుచర్ల స్టేజ్ వద్ద ఓ బొలేరో వాహనం ఢీ కొట్టగా ఆటోలో వెళ్లుతున్న ఈ ముగ్గురు సంఘటన స్థలంలో మృతి చెందారు. బొలేరో వాహనం మితి మీరిన వేగంతో వెళ్లే సమయంలో ముందుగా వెళ్లుతున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి గద్వాల్ డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ కర్నె శేఖర్ రెడ్డి చేరుకొని పరిశీలించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తమ్ గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు…
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ చేరుకొని మృతుల కుటుంబాన్ని పరామర్శించి మృత్యుల కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు ఈయన వెంట 7 వార్డు దౌదర్ పల్లి కౌన్సిలర్ విష్ణుప్రియ దౌలు ఉన్నారు…