అసువులు బాసిన అమరవీరుల వర్ధంతి ఘనంగా జరపాలి
– సిపిఐ (ఎంఎల్ )ప్రజాపందా జిల్లా నాయకులు ప్రసాద్
టేకులపల్లి, అక్టోబర్ 30 (జనం సాక్షి): భారతదేశ అశేషప్రజానిక విముక్తి కలగాలనే లక్ష్యంతో పోరాడి అశువులు బాసిన భారత విప్లవోద్యమ నాయకులు అమరులు అజేయులని, ఆ అమరవీరుల వర్ధంతిని గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకోవాలని సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంధా జిల్లా నాయకులు డి ప్రసాద్ అన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ 1 నుండి 7 వరకు గ్రామ గ్రామాన పేద ప్రజల కోసం పోరాడి అమరులైన అమరవీరుల వర్ధంతి జరపాలని అన్నారు. అమరవీరుల వర్ధంతి లో బాగంగా ఒకటవ తారీఖున గుండాలలో జరుగు బహిరంగ సభ గోడపత్రికలను తుమ్మలచెలక, బద్దుతండా, నంద్యాతండ, ఆంజనేయపాలెం,తుమ్మల చెలక స్టేజి లలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ భూమి, భుక్తి,విముక్తి కోసం తమ విలువైన జీవితాలను ప్రజలకు అంకితం చేసిన అమరులు రాయల సుభాష్ చంద్రబోస్. డి వెంకటకృష్ణ,దొరన్న,బాటన్నా,పగడాల వెంకన్న,కాచినపల్లి అమరవీరులు, అనబత్తుల కుమార్,లింగన్న, ఇంకా ఎంతో మంది తమ రక్తాన్ని ధారపోశారని అన్నారు .భూమి,భుక్తి కోసం సర్వసం త్యాగం చేసిన వీరులు పేద ప్రజల మదిలో చిరకాలం ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు భూక్య పంతులు, బంగారక్క, విజయ,రాంబాయి,కృష్ణ,వీరస్వామి,నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అసువులు బాసిన అమరవీరుల వర్ధంతి ఘనంగా జరపాలి




