Tuesday, 3 November 2026

భక్తి శ్రద్ధలతో కార్తీకమాస దీపారాధన.

భక్తి శ్రద్ధలతో కార్తీకమాస దీపారాధన.
ఆకాశ దీపోత్సవం, భజనలు, ప్రత్యేక పూజలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్30(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కార్తీకమాసం పురస్కరించుకొని పలు దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజనలు, అభిషేకాలు, దీపారాధన, ఆకాశదీప కార్యక్రమాలు వైభవంగ ఆదివారం నాడు నిర్వహించారు. కేసరి సముద్రం సమీపంలో గల హనుమాన్ దేవాలయంలో కార్తీక దీపారాధన కార్తీక భజనలు వైభవంగా నిర్వహించారు హనుమంతునికి అర్చనలు పూజలు ఆలయ ప్రధాన అర్చకులు ఎనమండ్ర రాజేశ్వర్ శర్మ భక్తులచే నిర్వహించారు. ఈదమ్మ గుడి కాలనీకి చెందినజంగిటి బుచ్చన్న భజన మండలి ప్రత్యేకంగా సాయంత్రం ఏడు గంటల నుండి పది గంటల వరకు ప్రత్యేకంగా హనుమాన్ కీర్తిస్తూ భజనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలిమేశ్వరయ్య, తిమ్మాజిపేట రాములు, వెంకటేశ్వరరావు,అలివేలమ్మ,ఇందిరాబాయి, జగన్,మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

రామాలయంలో:
ఆదివారం నాడు రాంనగర్ కాలనీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేకంగా సూర్యోదయ సమయంలో పంచామృత అభిషేకాలు, అర్చనలు,సూర్యాష్టకం తో ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ ఆధ్వర్యంలో భక్తులతో వేదమంత్రచరణాల మధ్య పూజలు నిర్వహించారు. హనుమాన్ దీక్షాపరులు గురుస్వామి వారి శ్రీను ఆధ్వర్యంలో కార్తీకదీపరాధన ప్రాతః కాలంలో నిర్వహించారు. ప్రదోషకాలంలో ఆకాశం దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక దీపారాధన, ప్రత్యేక ఆకాశ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. నిత్య విష్ణు సహస్ర పారాయణ కమిటీ వారిచే విష్ణు సహస్ర పారాయణ పారయణం చేశారు.

జ్ఞాన సరస్వతి దేవాలయంలో:

కొల్లాపూర్ చౌరస్తా లోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో ప్రదోషకాల సమయంలో ఆకాశం దీపోత్సవ కార్యక్రమం వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు పెంటమరాజు నవీన్ కుమార్ నిర్వహించారు, సామూహిక దీపారాధన, ఆకాశ దీపోత్సవ కార్యక్రమంలో దొడ్ల నారాయణరెడ్డి, భూపాల్ రెడ్డి, ఆశ్రమ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.