యువతకు మోసం చేస్తున్న కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు.
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 30(జనం సాక్షి)
నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా దేశంలో ఉన్న యువతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని డివైఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి విమర్శించారు. ఆది వారం
నగరంలోనీ కార్యాలయంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరేష్ పటేల్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో రోజురోజుకూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగం శాతాన్ని పెంచుతున్నారు గాని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా మన మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఎత్తివేసి ప్రైవేట్ కార్పొరేటర్ శక్తులకు అప్పజెప్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పించకుండా మోడీ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ఎలక్షన్లలో ఉన్న ఉత్సాహం ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పించడంలో ఎందుకు లేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఎలక్షన్లు పెట్టి మాయ మాటలు చెప్పి యువతను ఓటు బ్యాంకింగ్ గా ఉపయోగించుకుంటున్నారు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి బడ్జెట్ కేటాయించి భృతి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖలో సుమారు లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిసి కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నేటి వరకు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు లక్పతి నాయక్ భాస్కర్ సహకార దర్శులు రఘుపతి నాయకులు రవీందర్ అజయ్ అనిల్ వినోద్ సాయి భూమేష్ సింహాద్రి సురేష్ సంతోష్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
యువతకు మోసం చేస్తున్న కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు.




