హైదరాబాద్ : సడక్ బంద్ నేతల అరెస్టులకు నిరసనగా తెరాస ఎమ్మెల్యేలు ట్యాంక్‌బండ్ నుంచి అసెంబ్లీకి కాలినడకన బయలుదేరారు. ఈ సంద్భంగా తెరాస ఎమ్మెల్యే హారీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నింస్తోందన్నారు. ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సడక్ బంద్‌లో అరెస్టులపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.




