Tuesday, 3 November 2026

అసెంబ్లీ వేదికగా పోరాటానికి తెదేపా సిద్ధం

హైదరాబాద్‌: కళంకిత మంత్రులను తొలగించాలంటూ అసెంబ్లీ వేదికగా పోరాడేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం సిద్ధమైంది. ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహ మొత్తం 12 మంది అమాత్యులు కళంకితులేనంటూ జాబితా రూపొందించింది. బయ్యారం గనులు తెలంగాణ ప్రాంతానికి దక్కేలా చూడటంతో పాటు విద్యుత్తు సంక్షోభానికి వ్యతొరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ ప్రతులను అసెంబ్లీలో పెట్టడం ద్వారా సర్కారును నిలదీసేందుకు వ్యూహరచన చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *