ఇటిక్యాల (జనంసాక్షి) జూన్ 4 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయినా తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పిన 18 వేల మంది హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామన్న మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు వ్యవస్థకు ఏం న్యాయం చేశావని దశాబ్ద సంబరాలు జరుపుతున్నారని బీఎస్పీ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి ఎం జి. కృష్ణ ప్రశ్నించారు. ఆదివారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ద ఉత్సవాలకు వ్యతిరేకంగా బి ఎస్ పి పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి ఎంజి కృష్ణ, నియోజకవర్గ అధ్యక్షులు మహేష్, నియోజకవర్గ ఇన్చార్జి మధు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మణికుమార్ లు మాట్లాడుతూ పోలీసులతో వెట్టి చాకిరి చేయిస్తూ టీఏడీఏలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద ఉత్సవాలు జరిపే అర్హత లేదన్నారు. 2009, 2012 బ్యాచ్ ఎస్ఐలకు ఇప్పటివరకు పదోన్నతులు కల్పించలేదని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో పోలీస్ సంక్షేమానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ఉద్యోగం త్యాగం చేసిన బహుజన బిడ్డ డిఎస్పి నళిని ఎందుకు మళ్ళీ విధుల్లోకి తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల పట్ల మీరు తీసుకున్న ఆరోగ్య జాగ్రత్తలు ఏమిటో తెలపాలని డిమాండ్ చేశారు. పోలీసులతో వెట్టి చాకిరీ చేయిస్తూ మోసం చేస్తున్న కెసిఆర్ మళ్లీ వారితోనే ఉత్సాహాలు జరిపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసుల పక్షాన బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు యామిని సుంకన్న, నియోజకవర్గ సెక్రటరీ కోళ్ల మోహన్ రాజ్, మండల అధ్యక్షులు తిరుపాల్, మండల ప్రధాన కార్యదర్శి ఎస్ ఉపేందర్, మండల సెక్రెటరీ ఏ లక్ష్మన్న, వడ్డేపల్లి మండల అధ్యక్షులు లక్ష్మన్న, కన్వీనర్ జలంధర్, దస్తగిరి, రాజోలి మండల ఉపాధ్యక్షులు వెంకటేష్, అలంపూర్ మండల అధ్యక్షులు నాగరాజు, కొండేరు బిసన్న, ఉదండాపురం యువరాజు, మణిరత్నం, సాతర్ల యోసేపు, చాగాపురం లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ సాక్షిగా చెప్పిన 18 వేల మంది హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తామన్న మాట ఎక్కడ




