Wednesday, 4 November 2026

పార్టీలకు అతీతంగా పథకాల పంపిణీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

 

వీణవంక, జూన్ 04 (జనం సాక్షి) పేదింటి ఆడపడుచులకు మేన మామలాగ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలకతీతంగా పథకాలను అందజేస్తున్నారని దానిలో భాగంగానే ఇంటికి వెళ్ళి కళ్యాణాలక్ష్మి చెక్కును పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మె కౌశిక్ . మండలంలోని కనపర్తి, రెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లి, హిమ్మత్ నగర్. కోర్కల్ , , గంగారం గ్రామాలలో ఆదివారం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మండలంలో ఆయా గ్రామాలలో అరుగురికి రూ. 800896ల కళ్యాణలక్ష్మీ, నలుగురికి రూ.3 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంటింటికీ వెళ్ళి అందజేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు అండగా మేనమామలాగ వివాహలు అయి వెంటనే తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగానే రూ. లక్షా నూట పదహార్లు ఇంటికి తీసుకువచ్చి అందజేస్తున్నారని అన్నారు. పార్టీలకు, వర్గాలకు అతీతంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని, అనారోగ్యాలతో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ కార్పోరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న ఘనత బీఆర్ఎస్ పార్టీదని, అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక- తిరుపతి రెడ్డి, తాసిల్దార్ రాజయ్య. జడ్పీటీసీ మాడ వనమాల సాదవ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి ఆయా గ్రామ సర్పంచులు రమేష్, పోతుల నర్సయ్య, మర్రి వరలక్ష్మి, పింగిలి కోమాల్ రెడ్డి, అంగిడి రాధ, ఎంపిటిసిలు నల్ల మమత తిరుపతి రెడ్డి, సంగ స్వరూప సమ్మయ్య, కాసం వీరారెడ్డి, నాగిడి సంజీవరెడ్డి, ఒడ్డెపల్లి లక్ష్మీ- భూమయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.