జనం సాక్షి, నర్సంపేటగీసుగొండ మండలము లోని కొమ్మాల గ్రామానికి చెందిన తాల్లపెల్లి సమ్మక్క బీపి ఎక్కువై ఎంజీఎం లో చికిత్స పొందుతూ మృతి చెందగా మృతురాలు కి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె శారద గత సంవత్సరం కిడ్నీలు ఫెయిల్ ఐ చనిపోగా,చిన్న కూతురు సావిత్రి తల్లి కి తలకొరివి పెట్టింది. గ్రామస్తులు బంధు వులు తాను చేసిన పనులను గుర్తుకు చేసుకుంటూ, భర్త కొమ్మాలు, మనుమలు,మనుమరాల్ల రోదనలతో గ్రామ ప్రజలు కన్నీరు పెడుతూ అందరూ దుఖ్ఖ సంద్రంలో మునిగారు. అనంతరం కుటుంబ సభ్యులు గ్రామస్తుల సమక్షంలో మృతదేహాన్ని ఖననం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరాటి కవిత రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బాలోజు నాగయ్య,బీ ఆర్ ఎస్
సీనియర్ నాయకులు లింగారెడ్డి,బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు బొనగాని రాజు కుమార్,కన్నెబాయిన ప్రవీణ్ యాదవ్, ఎపూరి చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ జూలూరి కేదారి గౌడ్,తల్లపెల్లి తిరుమలేశు,
తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి ప్రజాపతి, జిల్లా ఉపాధ్యక్షులు పాలడుగుల నాగరాజు ప్రజాపతి,కందికొండ బుచ్చిరాములు ప్రజాపతి,కుల సంఘం పెద్దలు తాల్లపెళ్ళి సాంబయ్య ప్రజాపతి, రామచంద్రు ప్రజాపతి, మల్లయ్య ప్రజాపతి, శ్రీశైలం ప్రజాపతి,ప్రభాకర్ ప్రజాపతి, గణేష్ ప్రజాపతి,వివిధ సొసైటీ డైరెక్టర్లు,మండలం లోని వివిధ పార్టీల నాయకులు,ప్రజా ప్రతినిధులు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




