Monday, 2 November 2026

ఆంజనేయస్వామి తొడుగుకు 5 లక్షల విలువ చేసే వెండి బహుకరణ

– దేవునిపై భక్తిని చాటుకున్న జగన్మోహన్ రావు దంపతులు జనంసాక్షి, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం గురువారం వేలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి తొడుగుకు అవసరమైన రూ. 5 లక్షల విలువ చేసే వెండిని మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు దంపతులు బుధవారం వేదమూర్తులు సముద్రాల సంతోషాచార్యులకు, గ్రామస్తుల సమక్షంలో అందించారు. అనంతరం వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించి శాలువతో సన్మానించారు. 5 లక్షల విలువచేసే వెండిని బహుకరించినందుకు గ్రామ సర్పంచ్, గ్రామస్తులు,ఆంజనేయ స్వామి భక్తులు హర్షం వ్యక్తం చేశారు.