Monday, 2 November 2026

కార్మికుల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత

హుజూర్ నగర్ మార్చి 30 (జనంసాక్షి): కార్మికుల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ అన్నారు. గురువారం హుజూర్ నగర్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐటీయూసీ లోకల్ అమాలి అనుబంధ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆయా రంగాల వారీగాపనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ అడ్డాల వద్ద షెడ్లు నిర్మించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి 5000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తుంది. ప్రతి కార్మికులకు ఇల్లు స్థలం, వారి పిల్లలకు విద్యా, వైద్యం, ఉద్యోగంలాంటి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో లోకల్ అమాలి నాయకులు ముస్కు జానయ్య, చల్లా లక్ష్మీనారాయణ, రామిశెట్టి సుబ్బారావు, చల్లా శివ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.