జనం సాక్షి , కమాన్ పూర్ : బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఇనంగంటి రామారావు జన్మదినోత్సవం సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు గురువారం కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఓరుగల్లు వాలంటరి బ్లడ్ సెంటర్ వారి నేత్రుత్వంలో అలువాల వెంకటేష్, చెలువల్ల నవీన్ లు రక్తన్ని సేకరించారు. 40 మంది యువకులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేత ఇనుగంటి రామారావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువతను, రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలియజేశారు. ఇది ఒక మంచి కార్యక్రమం అని కొనియాడారు. ఆపదలో, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ రోజు యువకులు ఇచ్చిన రక్తం ఉపయోగపడుతుందాన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, సిద్దిపల్లె సర్పంచ్ తాటికొండ శంకర్, నాయకులు పిట్ల గోపాల్, బొమ్మగాని అనిల్ గౌడ్, నీలం శ్రీనివాస్, గాదె సది, గడప కృష్ణమూర్తి, బొజ్జ రాజసాగర్, జాబు సతీష్, కమ్మగోని అనిల్, మెడగొని విజయ్, మెరుగు కుమార్, మేడగొని సాయి, గోస్కి వరప్రసాద్, గడ్డం ప్రకాష్, సాన సురేష్, ఆదివారహస్వామి ఆలయ డైరెక్టర్లు, బీఆర్ఎస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
కమాన్ పూర్ లో రక్తదాన శిబిరంకమాన్ పూర్ లో రక్తదాన శిబిరం




