Sunday, 8 November 2026

ఆంజనేయ స్వామి గుడిలో ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు ప్రత్యేక పూజలు

ఆంజనేయ స్వామి గుడిలో ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు ప్రత్యేక పూజలు

టేకులపల్లి, డిసెంబర్ 25( జనం సాక్షి ): మండలం లోని ముత్యాలంపాడు గ్రామంలో ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్ దంపతులిరువురు ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు లక్కినేని శ్యామ్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బానోతు రామానాయక్, బానోతు కిషన్ నాయక్, భూక్యా పాపా నాయక్, సర్పంచ్ రమాదేవి, గుగులోతు కృష్ణ, బానోత్ రవికుమార్, జాటోత్ నరేష్ నాయక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.