Sunday, 8 November 2026

భారతీయులందరికి సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు

భారతీయులందరికి సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 25, జనంసాక్షి :
రాజనీతిజ్ఞుడు,మాజీ ప్రధాని,భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మెట్ పల్లి పట్టణ కేంద్రంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు సాంబారి ప్రభాకర్,బీజేపీ రాష్ట్ర నాయకురాలు పుదరి అరుణ ఆధ్వర్యంలో ఘననివాళులు అర్పించారు.ఈకార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మన్నె గంగాధర్,బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు పుల్ల సౌజన్య, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట విజయ్,బీజేపీ సీనియర్ నాయకులు పిన్నంశెట్టి గంగాధర్,మొగిలిపాక రాజయ్య,బీజేవైఎం పట్టణ ప్రధానకార్యదర్శి కలిగోట శ్రీకాంత్,బీజేవైఎం జిల్లా నాయకులు బొడ్ల గౌతమ్, బీజేవైఎం పట్టణ కార్యదర్శి భీమనాతి విజయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.