Sunday, 8 November 2026

క్రీస్తు జననం ప్రపంచానికి ఒక దివ్య సందేశం

క్రీస్తు జననం ప్రపంచానికి ఒక దివ్య సందేశం
– జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి హుజుర్ నగర్ హుజూర్ నగర్ డిసెంబర్ 25(జనంసాక్షి): మండలంలోని అమరవరం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న ప్రార్ధన మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, స్థానిక సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ సింగతల సైదమ్మ, ఆదినారాయణ రెడ్డి లు పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరీ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు ఆగమనమే ఒక దివ్య సందేశం అదే విశ్వమానవాళికి శుభసమయం అని అన్నారు. తన ప్రేమ తత్వంతో ప్రజలకు వెలుగులు పంచిన కరుణామయుడు ప్రేమ మూర్తి ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహోన్నతుడు ఏసుక్రీస్తు అని ప్రజలంతా సన్మార్గంలో నడిచి సంతృప్తితో జీవించాలని, బోధించిన క్రీస్తు బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి దూత అయిన జీసస్ విశ్వమానవాళి శ్రేయస్సును సర్వమానవ సమానత్వం శాంతి సహనం ఓర్పు ప్రేమ కరుణ కలిగి ఉండాలని పేదలు అనాధలు అభాగ్యుల పట్ల కరుణ చూపాలని, శతాబ్దాల క్రితమే క్రీస్తు బోధించాడు అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు శాంతి మార్గంలో నడుస్తూ తోటి వారి పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరమత సహనంతో క్రైస్తవ సమాజం అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో శాసన సభ్యలు శానంపూడి సైదిరెడ్డి క్రైస్తవ ప్రార్థన మందిరాలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తూ క్రైస్తవ సమాజానికి అనేక విధాలుగా అండగా ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యం కల్పిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘ సేవకులు పిట్ట మోజెస్, తలకప్పల దయాకర్, బల్బునూరి జాన్ రెడ్డి, షడ్రక్ , వార్డు సభ్యులు తేళ్ల సుగుణ, నగేష్, పొట్టేపంగు ధనమ్మ, పిచ్చి బాబు, సైదులు, లాజర్, విజయ్, శ్రీను, చంటి, గోపి తదితరులు పాల్గొన్నారు.