Thursday, 5 November 2026

ఆంధ్రజ్యోతి విలేఖరి సంపెంగుల సురేందర్ మృతి పట్ల ఏఐటియుసి సంతాపం

ఆంధ్రజ్యోతి విలేఖరి సంపెంగుల సురేందర్ మృతి పట్ల ఏఐటియుసి సంతాపం

సురేందర్ మృతి పత్రికా లోకానికి తీరని లోటు, పల్లా దేవేందర్ రెడ్డి
కొండమల్లేపల్లి జనవరి 13 జనం సాక్షి న్యూస్ :
ఆంధ్రజ్యోతి కొండమల్లే పల్లి విలేఖరి సంపెంగల సురేందర్ అకాల మృతికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు .సురేందర్ మరణం జర్నలిస్ట్ లోకానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉంటూ నిజాయితీగా పనిచేసే సురేందర్ గారు మృతి చెందడం బాధాకరమని అన్నారు. సురేందర్ కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలియజేశారు