ప్రజాప్రతినిధులందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ..,……..
కౌడిపల్లి (జనం సాక్షి). జనవరి 18 నుండి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అందరు కలసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రోజున మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందిఅని, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి వందరోజుల పాటు జరిగే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 18 వ తేదీన మండల కేంద్రమైన కౌడిపల్లిలో, మండల పరిధిలోని జాజితాండ గ్రామపంచాయతీలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు విధిగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి నాణ్యమైన కంటి అద్దాలు అదే రోజు ఇవ్వడం జరుగుతుందన్నారు. రోడ్లను కాపాడవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులనేనని, రోడ్డుపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు తిప్పినట్లయితే గౌరవ సర్పంచులు ఎంపిటిసిలు ప్రజాప్రతినిలందరూ ట్రాక్టర్స్ సీజ్ చేయించి కేసులు నమోదు చేసే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, జెడ్పిటిసి కవిత అమర్ సింగ్, ఎంపీడీవో భారతి, ఎమ్మార్వో కమలాద్రి, మండల కో ఆప్షన్ సభ్యులు హైమద్, పంచాయతీరాజ్ డిఈ అమరేశ్వర్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సారా రామ గౌడ్,వివిధ శాఖల అధికారులు మండల పరిధిలోని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి




