Thursday, 5 November 2026

ఆంబోత్ తండాలో నూతన పంపుసెట్ ప్రారంభించిన ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఏప్రిల్ 13 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఆంబోత్ తండ గ్రామపంచాయతీ పరిధిలో వేసవికాలం దృష్ట్యా ప్రజల కోసం నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది ఉండడం వలన ప్రజల అవసరం కొరకు కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి తమ సొంత నిధులతో పంపుసెట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆంబోతు తండా లో నీటి సమస్య ఎక్కువగా ఉండటం వలన ఎండాకాలంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రజల అవసరం కొరకు పంప్ సెట్ ఏర్పాటు చేశామని ప్రజలందరూ ఈ పంప్ సెట్ ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఉన్నారు అనంతరం ఆంబోత్ తండా ప్రజలందరూ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తండాలోని ప్రజల సమస్యను పరిష్కరించినందుకు ప్రజలందరూ కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, చెన్నారం ఎంపీటీసీ రామవత్ జగన్ నాయక్, సుఖ్య నాయక్, ఎండీ.ఖదీర్, పెద్ధిశెట్టి మహేందర్, చేపురీ కార్తిక్, రమేశ్, అంజి, ధరమ్ సింగ్ తదతరులు పాల్గొన్నారు.