నిర్మల్ బ్యూరో, ఏప్రిల్13,జనంసాక్షి,,, ఏఐసీసీ ప్రణాళికల అమలు కమిటీ ఛైర్మన్, నిర్మల్ మాజీ శాసనసభ్యులు యేలేటి మహేశ్వరెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీకి,పదవులకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షులు మాలికార్జున్ ఖార్గేకు పంపించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నాయకులు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులతో కలిసి రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్,జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా జేపీ నడ్డా నివాసంలో కాశయతీర్థం పుచ్చుకున్నారు,యేలేటి మహేశ్వరెడ్డి మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో నిర్మాల్లో బారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జాతీయ నాయకులను రప్పిస్తానని తెలిపారు.




