గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 13 (జనం సాక్షి);ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణకు సహకరించాలాని గద్వాల ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ వాహనాదారులకు తెలియజేశారు.గురువారం గద్వాల పట్టణ కేంద్రంలోని గాంధీచౌక్ పరిధిలోని తన ట్రాఫిక్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించి,ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారు డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పత్రాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానాలతోపాటు జైలు శిక్ష తప్పదన్నారు. అతివేగంం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడడంతోపాటు ఎందరో క్షతగాత్రులవుతున్నారన్నారు.మద్యం సేవించి వాహనం నడపవద్దని, జిల్లాలో ప్రతినిత్యం డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మైనర్లకు వాహనాలివ్వొద్దని, ఒకవేళ వాహనాలు ఇస్తే తల్లిదండ్రులతోపాటు వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. 80 కి.మీ కన్నా వేగంగా వెళితే జరిమానాలు తప్పవన్నారు. వాహనదారులు ఖచ్చితంగా ధృవీకరణపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనల గురించి తెలుసుకోవడంతో పాటు వాటిని పాటించి ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది శివ కుమార్,సుధాకర్,రామ కృష్ణ, బలరాం, కృష్ణ నాయుడు,ఖలీల్ పాల్గొన్నారు.




