Thursday, 5 November 2026

ఆక్రమణల తొలగింపునకు పట్టింపేదిఆక్రమణల తొలగింపునకు పట్టింపేది

డోర్నకల్ జనవరి 22 జనం సాక్షి
ఇరుకు రోడ్ల ఇలాకాలో రోడ్లు,డ్రైనేజ్ కాలువలను ఆక్రమించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు,కూరగాయలు,టీ స్టాళ్లు, తినుబండారాలు,తోపుడు బండ్లును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.కంపు కొడుతున్న కాలువలు,ఆక్రమణల తొలగింపు చేపట్టాలని స్థానిక యువకులు,వ్యాపారులు ఇటీవల వివిధ రూపాల్లో వినూత్న నిరసనలు చేపట్టారు.దీంతో పుర అధికారులు డ్రైనేజీలపై ఆక్రమణలు తొలగింపులకు ఉపక్రమించగా స్థానిక ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు తాత్కాలికగా నిలిపివేశారు.ఇప్పటికైనా పురపాలక డెవలప్మెంట్ కు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.ఇదే విషయమై సంబంధిత అధికారి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సంక్రాంతి వరకు సమయం ఇచ్చినట్లు తెలిపారు.రోడ్లు,కాలువలను ఆక్రమించిన వ్యాపారాలు స్వచ్ఛంధంగా తొలగించుకోవాలని,లేని పక్షంలో తామే స్వయంగా తొలగిస్తామని హెచ్చరించారు.