Thursday, 5 November 2026

దళితులహక్కుల సాధనకు అందరు ఐక్యంగా కలిసి పోరాడాలి

 

జహీరాబాద్ జనవరి 22 దళితులహక్కుల సాధనకు అందరు ఐక్యంగా కలిసి పోరాడాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య అన్నారు. ఆదివారం మాల మహానాడు  సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి జనార్ధన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య హాజరై మాట్లాడుతూ పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని అదేవిధంగా బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులపై ఎక్కడ దాడి జరిగిన వాటి ని ఖండించి దళిత సమస్యలపై వాటి పరిష్కారం దిశగా చొరవ చూపాలని సందర్భంగా తెలిపారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని కొందరుకుట్ర పన్నుతున్నారనిఈ కుట్రను దళితులందరూ ఐక్యంగా కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. దళిత సమస్యల పైన సంఘటితంగా ఎదుర్కోవాలని అన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శ్రీధర్ రావు,సంగారెడ్డి  జిల్లా మహిళా అధ్యక్షురాలు మనియర్ పల్లి  నరసమ్మ, ఝరాసంగం నాగమ్మ , కోహిర్ మండల అధ్యక్షుడు జైపాల్,జిల్లా నాయకులు ఎం విజయ రావు డాక్టర్ హనుమంతు, బాలరాజు సమత సైనికులు నాయకులు,మాల మహానాడు జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు దీపకు ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.