Thursday, 5 November 2026

సర్పంచ్ నిరంజన్ గౌడ్ పై దాడి దారుణమైన ఘటన..

– బీసీ యువజన సంఘం కల్వకుర్తి డివిజన్ అధ్యక్షుడు బోల్గం దివాకర్ గౌడ్.
ఊరుకొండ, జనవరి 22 (జనంసాక్షి):
నర్సంపల్లి సర్పంచ్ నిరంజన్ గౌడ్ పై బీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం దారుణమైన ఘటన అని బీసీ యువజన సంఘం కల్వకుర్తి డివిజన్ అధ్యక్షుడు బోల్గం దివాకర్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఊరుకొండ మండల కేంద్రంలో ఉన్న 401,
402. 403, 410 వెంచర్ కి ఇరువైపుల ఉన్న రేవల్లి రాచాలపల్లి ఉరుకొండ గ్రామానికి వెళ్లే రహదారిని అక్రమించినందున సరైన క్రమంలో లేకపోవడంతో నర్సంపల్లి సర్పంచ్ నిరంజన్ గౌడ్ అధికారులకు ఫిర్యాదు చేసిన మేరకు, అధికారులు గురువారం అక్కడ ఉన్న సమస్యను వీక్షించేందుకు వచ్చినందున అక్కడే వారు చేసిన అవకతవకలు వివరిస్తుండగా ప్రధాన కూడలిలో ఉన్న వెంచర్ యొక్క యాజమానికి సంబంధించిన కొందరు వ్యక్తులు, నిరంజన్ గౌడ్ అధికారులతో సంబంధించిన విషయం మాట్లాడుతుండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు నిరంజన్ గౌడ్ పై స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బినామీ అయిన ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి లు అండగా ఉన్నారు అనే బలంతో దుండగులు దాడి చేయడం చాలా దుర్మార్గమైన సంఘటన… ప్రశాంతంగా ఉన్న ఉరుకొండ మండల కేంద్రాన్ని రాజకీయంగా ఇరు వర్గాల నేతల మధ్య వాగ్వాదాలు సృష్టిస్తే సహించేది లేదు అని బీసీ యువజన సంఘం కల్వకుర్తి డివిజన్ అధ్యక్షుడు బోల్గం దివాకర్ గౌడ్ హెచ్చరించారు. బీసీ వర్గానికి చెందిన నర్సంపల్లి సర్పంచ్ నిరంజన్ గౌడ్ ని ఒక్కడినే చేసి అతను ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచ్ అని వెంట ఎవరు లేరు అనే ఆలోచనతో అత్య చేసేందుకు కుట్ర చేశారనీ ఆరోపించారు. ఈ సంఘటనలో వారు గాయపడ్డటమే కాకుండా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి దాడులు చేస్తే దాడికి ప్రతి దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసారు. అలాగే నిరంజన్ గౌడ్ గారితో పాటు, బీజేపీ నాయకులు అయిన రాజేందర్ గౌడ్, వెంకటేష్, పరుషరాములు, మరియు తదితర నాయకుల పై దాడి చేయడం జరిగింది. బంగారు తెలంగాణ లో సర్పంచ్ లకు రక్షణ కరువైంది సర్పంచ్ లకు వెంటనే రక్షణ కల్పించాలని అని అన్నారు. ఊరుకొండ మండలంలో రాజకీయాలు స్నేహబంధంగా ఉండాలి కానీ ఇలా ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టె కక్షసాధింపు విధంగా ఉండొద్దనీ పేర్కొన్నారు. మండల పోలీస్ అధికారులు తక్షణమే నిరంజన్ గౌడ్ గారిపై దాడి చేసిన దుండగులపై చట్టరీత్య కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామనీ పేర్కోన్నారు. విలేఖరుల సమావేశంలో అరవింద్ గౌడ్. శేఖర్ తదితరులు ఉన్నారు.