Wednesday, 4 November 2026

ఆక్రమణల తొలగింపు షురూ

..
– జనం సాక్షి ఎఫెక్ట్

డోర్నకల్ జనవరి 25 జనం సాక్షి

పురపాలక ప్రధాన రహదారితో పాటు నిత్యం రద్దీగా ఉండే ఇతర రహదారుల్లో రోడ్లు,డ్రైనేజ్ కాలువల ఆక్రమణల తొలగింపు బుధవారం మొదలైంది.ఇటీవల జనం సాక్షి పత్రిక “మున్సి పల్టీ”ఆక్రమణల తొలగింపు”వరస శీర్షికలు ప్రచురించింది.కథనాలకు స్పందించిన అధికారులు డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు.టౌన్ ప్లానర్ రమేష్ పర్యవేక్షణలో సిబ్బంది తొలగింపు చర్యలకు పూనుకున్నారు.మళ్లీ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు.ఉదయం సాయంత్రం సిబ్బందితో పర్యవేక్షించనున్నట్లు ఆయన తెలిపారు.మున్సిపాలిటీ అభివృద్ధికి వ్యాపారులు,ప్రజలు సహకరించాలని కోరారు.