Wednesday, 4 November 2026

పొలాలను సందర్శించిన ఏఈవో

జుక్కల్, జనవరి 25, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలములోని కాస్లాబాద్ శివారులో బుధవారము ఏఈఓ రూప పొలాలను సందర్శించారు. వరి పంటను మొగి పురుగు ఆశించిందని తెలిపారు. దీనినివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్ పి 2 gm/.3ml లేదా క్లోట్రానిలిప్రోల్ 18.5 sp మందును ltr నిటికి కలిపి పిచికారి చెయ్యాలని తెలిపారు. రైతులు పురుగుమందులు, రసాయనిక ఎరువులు,విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా రశీదు తీసుకోవాలని తెలిపారు.రైతులు వ్యవసాయ అదికారుల సూచనలు, సలహాలు పాటించి అదిక దిగుబడులు సాధించాలని తెలిపారు.