Thursday, 5 November 2026

ఆక్వా పరిశ్రమకు వ్యతిరేకంగా మత్స్యకారుల నిరసన

విశాఖపట్టణం,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): కొత్తరేవు పోలవరం వద్ద నిర్మిస్తున్న సాయి ఆక్వాఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ శుక్రవారం స్థానిక మత్స్యకారులు నిరవధిక దీక్షలు చేపట్టారు. దీనివల్ల వాతావరణం కలుషితం కాగలదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ.. సాయి ఆక్వా ఫుడ్‌ ప్రోసెసింగ్‌ సంస్థను ఏర్పాటు చేస్తే వాతావరణంతో పాటు జలవనరులు నాశనమవుతాయని, కాబట్టి సంస్థ నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరుతూ కొన్నాళ్లుగా సంబంధిత అధికారులకు తాఖీదులు ఇచ్చినా ఫలితం లేకపోయిందని తెలిపారు. అధికారులు స్పందించనందున శుక్రవారం రిలేదీక్షలు చేపట్టామని చెప్పారు. ఈ దీక్షలో దాదాపు వెయ్యిమంది మత్స్యకారులు ప్లకార్డులను చేతపట్టి తమ నిరసనను తెలిపారు.