Wednesday, 4 November 2026

ఆగస్టులో సింగరేణి ఎన్నికలు!

 (ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి) ఐదు సంవత్సరాల తర్వాత సింగరేణి లో యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగనున్నాయి! ఆగస్టు రెండో వారంలో ఎన్నికలు ఉంటాయి! ఈ నెల 24 న మరోసారి జరిగే సమావేశం లో నోటిఫికేషన్ జారీ చేస్తారు! ఈ మేరకు మినిట్స్ డ్రా చేసుకుని సంతకాలు కూడా చేసుకున్నారు!మంగళవారం హైదరాబాద్ లోని డిప్యుటీ చీఫ్ లేబర్ కమిషనర్,ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు సమక్షంలో అతని కార్యాలయం లో సింగరేణి లోని 14 రిజిస్టర్డ్ కార్మిక సంఘాల ప్రతినిధుల,యాజమాన్యం ప్రతినిధుల సమావేశం జరిగింగింది! సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్,పర్సనల్ బలరాం,యూనియన్ నేతలు పాల్గొన్నారు.కొన్ని యూనియన్ లు గెలిచే యూనియన్ కు సంబంధించి కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉండాలని ఓ మూడు యూనియన్లు,రెండు ఏండ్లు మాత్రమే ఉండాలని,మెజారిటీ యూనియన్లు కోరిన నేపథ్యంలో విషయాన్ని ఢిల్లీ లోని సీఎల్సి కి విన్న వించడానికి యాజమాన్యం 10 రోజుల సమయం అడిగింది! దీనితో ఈ నెల 24 కు సమావేశం ను డిప్యూటీ సిఎల్సీ వాయిదా వేసారు! అయితే గతంలోనే సిఎల్సి గుర్తింపు కాలపరిమితి ని రెండేండ్లుగా నిర్ణయించడం జరిగింది!యూనియన్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అనుబంధ టిబిజీకెఎస్ తో పాటు,ఏఐటీయూసీ,ఐఎన్టియుసి,హెచ్చెమ్మెస్,సీఐటీయూ,బిఎమ్మెస్ ల తో పాటు ఐఎఫ్టియూ,ఎఐఎఫ్ టియు,ఉద్యోగుల సంఘం,టిఎన్ టి యుసి తదితర 14 సంఘాల నేతలు పాల్గొన్నారు.ఏడో సారి సింగరేణి లో ఎన్నికలు జరుగనుండగా,మూడు సార్లు ఏఐటీయూసీ,ఒకసారి ఐఎన్ టియుసి,రెండు సార్లు టీబిజీకెఎస్ లు గుర్తింపును సాధించాయి! మొత్తం అరుజిల్లాల్లో వ్యాపించి ఉన్న సింగరేణి ఎన్నికలు,రానున్న అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలను సైతం ప్రభావితం చేస్తాయి! మొత్తం 4 పార్లమెంట్,11 అసెంబ్లీ స్థానాలమీద ప్రభావం ఉంటుంది!