బచ్చన్నపేట జూన్ 13 (జనం సాక్షి)
మండల కేంద్రంలోని బచ్చన్నపేటలో గత కొన్నేళ్లుగా వివిద దినపత్రికల్లో పని చేస్తున్న ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో స్థానిక తహసిల్దార్ గంగా భవానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ సుమారు 30 ఏళ్లకు పైగా వివిధ దినపత్రికల్లో పని చేస్తున్నారని, వారందరికీ ప్రభుత్వం అక్రిడిడేషన్ కార్డులు అందించిందన్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. ఈ మేరకు ఆమె సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు తేలుకంటి మురళి, ముశిని వీరాగౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి, గంట తిరుమల్ రెడ్డి రెడ్డబోయిన హరికుమార్, సందెల బాలసిద్దులు, గర్నేపల్లి కరుణాకర్, పంబాల మల్లేశం, మంచాల సంతోష్ కుమార్, తాటిశెట్టు భాస్కర్, మల్యాల బాల నర్సయ్య, తేలుకంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లస్థలాలు కెటాయించాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందించిన విలేకరులు




