Thursday, 5 November 2026

ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసు తీర్పు వాయిదా

today Judgment on Maoist leader Azad encounter

హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో తీర్పు వాయిదా పడింది. ఆదిలాబాద్ మున్సిఫ్ కోర్టు తీర్పును మార్చి 13కు వాయిదా వేసింది. 2010 జులై 2న ఆజాద్ ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్, జర్నలిస్టు హేమచంద్రపాండే ఎన్‌కౌంటర్ బూటకమని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై స్వామి అగ్నివేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆజాద్ బయటకు రాగానే పోలీసులు ఆయనను నాగ్‌పూర్‌లో బంధించి ఆదిలాబాద్‌లోని వాంకిడి అడవులకు తీసుకొచ్చి ఆజాద్‌తోపాటు జర్నలిస్టు హేమచంద్ర పాండేను కాల్చి చంపారని స్వామి అగ్నివేశ్ ఆరోపించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *